అక్షరటుడే వెబ్‌డెస్క్: KLU Library Fire | గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ప్రముఖ కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం (KLU) ప్రాంగణంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వర్సిటీ భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న సెంట్రల్ లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి.
KLU Library Fire | షార్ట్ సర్క్యూటే కారణం?..
రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల్లోనే మంటలు లైబ్రరీ అంతటా వేగంగా వ్యాపించడంతో.. లోపల ఉన్న వేలాది పుస్తకాలు, విలువైన ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కిటికీల గుండా దట్టమైన పొగ, మంటలు పెద్ద ఎత్తున బయటకు రావడంతో క్యాంపస్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.
KLU Library Fire | తప్పిన పెను ప్రమాదం..
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో లైబ్రరీలో విద్యార్థులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. ఈ విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే విశ్వవిద్యాలయ యాజమాన్యం అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపితేనే నష్టానికి సంబంధించిన అసలు వివరాలు తెలియాల్సి ఉంది.
KL వర్సిటీ లైబ్రరీలో భారీ పేలుడు
విజయవాడ KL యూనివర్సిటీ సెంట్రల్ ప్రాంగణంలో భారీ పేలుడు సంభవించింది. క్యాంపస్‌లోని లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
A reported explosion triggered a fire at the library on KL… pic.twitter.com/ju5GN9ChMO
— Akshara Today | Telugu News (@AksharaToday) October 2, 2026
ఇది కూడా చదవండి: Archery Gold Medal | ఆర్చరీలో మరో బంగారు పతకం