Armoor Police Review | వృద్ధులకు ఆత్మీయ సత్కారం.. అధికారులకు సీపీ సాయిచైతన్య దిశానిర్దేశం

ఆర్మూర్​ డివిజన్​ పరిధిలోని అంకాపూర్​లో లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ సాయిచైతన్య సందర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Armoor Police Review | ఆర్మూర్​ డివిజన్​ పరిధిలోని అంకాపూర్​లో (Ankapur) లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) సందర్శించారు. అక్కడి వృద్ధులతో అప్యాయంగా మాట్లాడారు. అనంతరం డివిజన్​పై ఆశ్రమంలోనే పోలీసు అధికారులతో సమీక్షించారు.

Armoor Police Review | వృద్ధుల బాగోగులు తెలుసుకుంటూ..

మొదట సీపీ సాయిచైతన్య లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి వృద్ధులు ఒక్కొక్కరితో అప్యాయంగా మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆరోగ్యాలు బాగా చూసుకోవాలని సూచించారు. అనంతరం వారికి దుస్తులు అందజేశారు. అక్కడే ఆర్మూర్​ డివిజన్​పై సమీక్ష అనంతరం ఆశ్రమంలోనే ఆర్మూర్​ డివిజన్​ పోలీస్​ అధికారులతో సీపీ సమీక్షించారు. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని తెలుసుకున్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Armoor Police Review | వాహనాల తనిఖీ చేయాలి

రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని సీపీ ఆదేశించారు. వాహనాల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహనాల తనిఖీలు సమయంలో సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. ఈ సందర్బంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్​ రెడ్డి, సీసీఆర్​బీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

tiu

ఇది కూడా చదవండి:  రైతు బీమా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *