Inter Certificates | ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం : డీఐఈవో

జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్ జూనియర్ కళాశాలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఇంటర్ ​సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామని నిజామాబాద్​ డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Inter Certificates | జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్ జూనియర్ కళాశాలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఇంటర్​ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామని నిజామాబాద్​(Nizamabad) డీఐఈవో రవికుమార్ (DIEO)​ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Inter Certificates | ఇంటర్​ బోర్డు ఆదేశాల మేరకు..

గత మార్చి వార్షిక, మే సప్లిమెంటరీ పరీక్షలలో ఇంటర్ (Intermediate Education) పాస్ అయిన విద్యార్థులు పైచదువుల కోసం టీసీలు, బొనాఫైడ్​లు, ఇతర ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే కళాశాల యాజమాన్యాలపై బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే విద్యార్థులు వెంటనే జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు కళాశాలలపై ఇంటర్ బోర్డుకు నివేదిస్తామని సూచించారు.

nizamabad 2

ఇది కూడా చదవండి: #BREAKING: వియత్నాంలో బోల్తా పడిన పడవలో ప్రయాణించిన 32 మంది జాబితాను అక్కడి భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *