అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: TRS District Committee | తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నిజామాబాద్(Nizamabad) జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కార్యవర్గాన్ని ప్రకటించారు.
TRS District Committee | కార్యవర్గ సభ్యులు వీరే..
జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దొంత ప్రవీణ్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జీగా కందేటి మౌనిక రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జీగా అలీం, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నరేష్ నాయక్, నిజామాబాద్ టౌన్ ఇన్ఛార్జీగా యెండల ప్రసాద్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్, అర్బన్ మైనారిటీ ఇన్ఛార్జీగా షాన్వాజ్, బంజారా జిల్లా అధ్యక్షుడిగా ప్రేమ్ నాయక్ నియమితులయ్యారు.
TRS District Committee | పార్టీని బలోపేతం చేస్తాం..
నూతన బాధ్యతలు తీసుకున్న జిల్లా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమపై ఉన్న నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు కవితకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అవంతి కుమార్, సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మాండ్లు, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, దినేష్, సాయి నిఖిల్, మహేష్, నికిత్, ఆశిష్, రేఖ, శోభ, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు