అక్షరటుడే వెబ్‌డెస్క్: Max Fashion Hyderabad Store | ఫ్యాషన్ ప్రియులకు గుడ్‌న్యూస్ చెబుతూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నెక్సస్ హైదరాబాద్‌లో మ్యాక్స్ ఫ్యాషన్ సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. నగరంలో మ్యాక్స్ ఫ్యాషన్ సరికొత్త రూపులో ఏర్పాటు చేసిన తొలి స్టోర్ ఇదే కావడం విశేషం. ఈ అట్టహాసమైన ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాక్స్ ఫ్యాషన్ సీఈవో సుమిత్ చంద్నాతో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేసి స్టోర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘మ్యాక్స్ ప్రాజెక్ట్ న్యూ’ (Project New) కలెక్షన్‌ను మృణాల్ ఆవిష్కరించారు. ప్రముఖ నటి కల్కి కోచ్లిన్ క్యూరేట్ చేసిన ఈ ఫెస్టివ్ కలెక్షన్.. రాజస్థాన్‌లోని సంగనేర్ బ్లాక్ ప్రింటింగ్ నుంచి ప్రేరణ పొందింది. అలాగే చెన్నైకి చెందిన కైరస్సీ ఫౌండేషన్ దివ్యాంగులైన కళాకారుల చేతిపనులతో దీన్ని తీర్చిదిద్దడం మరో ప్రత్యేకత.
Max Fashion Hyderabad Store | సరికొత్త షాపింగ్ అనుభవం..
దాదాపు 13,000 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో ఏర్పాటైన ఈ స్టోర్.. కస్టమర్లకు సరికొత్త రిటైల్ అనుభవాన్ని అందించనుంది. “లోపలికి అడుగుపెట్టి, తేడాను అనుభవించండి” అనే నినాదంతో దీనిని తీర్చిదిద్దారు. కస్టమర్లు తమకు నచ్చిన వేగంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకునేలా విశాలమైన దారులు, ఆకట్టుకునే లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మ్యాక్స్ ఫ్యాషన్ సీఈవో సుమిత్ చంద్నా మాట్లాడుతూ.. హైదరాబాద్ తమకు ఎప్పుడూ ముఖ్యమైన మార్కెట్ అని, ఇక్కడ తమ తొలి ‘న్యూ ఐడెంటిటీ’ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇక్కడి కలెక్షన్లు, స్టోర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నాయని, ఒక సాధారణ దుకాణానికి వెళ్లినట్లు కాకుండా ప్రత్యేక అనుభూతిని పొందినట్లు ఉందని ప్రశంసించారు.
హైదరాబాద్‌లో మ్యాక్స్ ఫ్యాషన్‌కు ఇది 39వ స్టోర్ కావడం గమనార్హం. పురుషులు, మహిళలు, పిల్లలందరికీ సరిపోయే దుస్తులతో పాటు పాదరక్షలు, యాక్సెసరీస్ అన్నీ ఒకే చోట లభించనున్నాయి. దేశవ్యాప్తంగా మ్యాక్స్ ఫ్యాషన్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ కొత్త స్టోర్ ప్రారంభం కావడం బ్రాండ్‌కు మరింత ప్రాధాన్యతను సంతరించింది.
ఇది కూడా చదవండి: Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు