అక్షరటుడే, వెబ్డెస్క్: Rain Forecast | రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ (Telangana) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళ వర్షం పడుతుంది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వానలు పడుతాయి. హైదరాబాద్ నగరలో సైతం రాత్రి వేళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Rain Forecast | జోరుగా సాగు పనులు

రాష్ట్రంలో వానలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 25 రోజులు అవుతున్నా.. మూడు, నాలుగు రోజుల నుంచే వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. వరినాట్లు వేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro controversy | మెట్రోపై రేవంత్ రెడ్డి ‘తుగ్లక్’ మార్క్: 25 నిప్పుల అస్త్రాలతో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్!