అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) షాక్ ఇచ్చి బయటకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin)తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ (BJP) కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాఘవ్‌తో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా పాల్గొన్నారు.
Raghav Chadha | ఘనంగా ఆహ్వానం
పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఈ ముగ్గురు నేతలకు నితిన్ నబీన్ ఘన స్వాగతం పలికారు. వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ భేటీలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయినప్పటికీ, రాఘవ్ చడ్డా బృందం ప్రస్తుతానికి బీజేపీ కండువాలు కప్పుకోకపోవడం గమనార్హం.
Raghav Chadha | భారీ బహిరంగ సభ
రాజ్యసభ (Rajyasabha)లో విలీన ప్రక్రియ లేదా సాంకేతిక కారణాల దృష్ట్యా వీరు ఇంకా అధికారికంగా కండువాలు కప్పుకోలేదని, త్వరలోనే భారీ బహిరంగ సభ ద్వారా పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు బీజేపీలో చేరుతున్నట్లు చడ్డా తెలిపారు. కాగా ఇటీవల ఆప్ చడ్డాను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం గమనార్హం.
BJP National President Shri @nitinnabin warmly welcomed Shri Raghav Chadha, Shri Sandeep Pathak, and Shri Ashok Mittal into the BJP family at the Party Headquarters today. ⬇️
Shri Nitin Nabin also congratulated Shri Harbhajan Singh, Swati Maliwal, and Shri Vikram Sahney for… pic.twitter.com/uoEDlcKA1h
— BJP Jammu & Kashmir (@BJP4JnK) April 24, 2026
దీనిని కూడా చదవండి : Kejriwal Tweet | పంజాబీలను దెబ్బకొట్టిన బీజేపీ.. ఎంపీల జంప్‌పై కేజ్రీవాల్ ఘాటు ట్వీట్

