CV Anand DGP| అమ్మ కోరిక తీర్చిన కొడుకు..సీవీ ఆనంద్ ఎమోషనల్ పోస్ట్!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CV Anand DGP| తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, బాధ్యతలు చేపట్టే ముందు తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన, ఈ సందర్భంగా తన తల్లితో దిగిన ఫోటోలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

CV Anand DGP|అమ్మ సంకల్పమే ఆమెను నిలబెట్టింది..

గత సంతత్సరం నవంబర్ నుండి ఈ ఏడాది జనవరి వరకు తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె మంచానికే పరిమితమైనప్పటికీ, ఆరోగ్యం కొంత మెరుగుపడిందని తెలిపారు. తన కుమారుడిని రాష్ట్ర డీజీపీగా చూడాలనే ఆమె ప్రగాఢ వాంఛే, అంతటి అనారోగ్యం నుండి ఆమెను కోలుకునేలా చేసిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

CV Anand DGP|తల్లి ఆశీస్సులతో బాధ్యతల స్వీకారం..

తన కొడుకు ఉన్నత పదవిని అధిష్టించబోతున్నాడని తెలుసుకున్న ఆ తల్లి ఎంతో ఆనందపడ్డారు. తల్లి దీవెనలు తీసుకున్న అనంతరం సీవీ ఆనంద్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.”ఆమె సంతోషం చూసి నాకూ ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపించింది” అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు , ఆయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక ఉన్నత స్థాయి అధికారి తన విజయాన్ని తల్లికి అంకితం ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPL Ticket Scam| ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై పోలీసుల పంజా.. అడ్డంగా బుక్కైన ముఠా!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *