అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sudhakar Hyderabad Marathon | హైదరాబాద్లో ఎన్ఈబీ స్పోర్ట్స్ (NEB Sports) ఆధ్వర్యంలో హైటెక్ మారథాన్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిజామాబాద్(Nizamabad) విజిలెన్స్ అండ్ ఏపీటీఎస్ (APTS) పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డి.సుధాకర్ ప్రతిభ కనబర్చారు.
Sudhakar Hyderabad Marathon | 42.195 కి.మీ దూరాన్ని 6.18 గంటల్లో పూర్తి..
మారథాన్లో వెంకటేష్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 18 నిమిషాల్లో విజయవంతంగా పూర్తిచేశారు. ఇది ఆయన రెండవ ఫుల్ మారథాన్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు హాఫ్ మారథాన్లు, రెండు ఫుల్ మారథాన్లు పూర్తి చేశారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూనే, శారీరక దృఢత్వం, ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ పరుగును తన జీవితంలో భాగంగా చేసుకున్నారు.
పరుగులు కేవలం పతకాలు, రికార్డుల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని సుధాకర్ అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణతో పాటు ఫిట్నెస్కు సమయం కేటాయిస్తూ యువతకు ఆరోగ్యం, క్రమశిక్షణ, పట్టుదల ప్రాముఖ్యతను తెలియజేయడమే తన విలేజ్ టు విజన్ (village2vision) లక్ష్యమని సుధాకర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : రిగ్గింగ్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు – మాజీ మంత్రి విడదల రజిని