అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోఆలని సూచించారు.
నగరానికి నీటిని సరఫరా చేసే గండిపేట (Gandipet) కాండ్యూట్లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పనులు చేపట్టనున్నారు. ఈ పనుల నేపథ్యంలోని నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
Hyderabad Water Supply | అంతరాయం ఉండే ప్రాంతాలు
గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ ప్రాంతాల్లో నవంబర్ 3న తాగునీరు సరఫరా కాదు. గోల్కొండ జోన్‌లోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో సైతం ససరఫరా నిలిచిపోనుంది. కవాడిగూడ సర్కిల్లోని కవాడిగూడ, దోమలగూడ, బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉండనుంది. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
దీనిని కూడా చదవండి : YS Jagan | అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులు : వైఎస్ జగన్