YS Jagan | అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులు : వైఎస్​ జగన్​

మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని వైఎస్​ జగన్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.

పులివెందులలో జగన్​ మీడియాతో మాట్లాడారు. పోలీసులే దగ్గరుండి ప్రజాస్వామయ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో 80పోలింగ్ బూతులు ఉంటే, 70 పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరన్నారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ వాళ్లు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వచ్చిన ఓటర్ల వద్ద స్లిప్పులను లాక్కొని, పోలీసులు వెనక్కి పంపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి పోలీసులే సహకరిస్తున్నారని విమర్శించారు.

YS Jagan | ఆర్వో ఆఫీసు ఎదుట ధర్నా

పులివెందుల ఆర్వో ఆఫీసు ఎదుట బైఠాయించిన వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. క్యాంప్ ఆఫీసు నుంచి ఆర్వో ఆఫీసుకు ఆయన వెళ్లారు. 70 మంది వైసీపీ ఏజెంట్లతో ఆర్వో ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. పోలింగ్ బూత్‌ల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్‌ పెట్టాలని డిమాండ్​చేశారు. తమ పార్టీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిపైనా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టే.. కాక్రోచ్‌లు, మావోయిస్టులు పుడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిని కూడా చదవండి : Delhi Pollution | ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​పై కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *