అక్షరటుడే వెబ్‌డెస్క్: Janasena Vijayawada Joinings | విజయవాడలో జనసేన పార్టీ బలోపేతమవుతోంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం నాయకులతో పాటు విద్యాసంస్థల నిర్వాహకులు, వ్యాపారవేత్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Janasena Vijayawada Joinings |ఘనంగా చేరికలు..
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మధుసూదన్, కటకం జ్యోతి, ఆల్లూరి శంకర్, మర్రి బెంజిమన్, సీపీఎం నేత కొంపెల్ల భాను లక్ష్మి నారాయణ తదితరులు జనసేన గూటికి చేరారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు గన్నవరం ప్రాంతాలకు చెందిన పలువురు కాలేజీల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, సామాజిక కార్యకర్తలు సహా సుమారు 300 మంది నాయకులు పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
Janasena Vijayawada Joinings | భవిష్యత్తులో తగిన గుర్తింపు ..
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కార్యకర్తలందరినీ సొంత కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన గుర్తింపు దక్కుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన నాయకులకు సముచిత న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
Janasena Vijayawada Joinings | ఉపాధి కల్పనే ధ్యేయంగా ..
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఉపాధి కల్పన కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు. ఇందులో భాగంగా 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, అలాగే 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Cow Protection | గోసేవ, గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి