అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cow Protection | గోసేవ, గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర గో సంరక్షణ సేవాసమితి, పర్యావరణ సంరక్షణ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ధన్పాల్ రాజేష్ పేర్కొన్నారు. ఏకాదశి సందర్భంగా జిల్లా (Nizamabad) కేంద్రంలోని గోశాలలో గోవులకు ఆహారం తినిపించి.. సేవా కార్యక్రమం నిర్వహించారు.
Cow Protection | ప్రతిఒక్కరూ సమయం వెచ్చించాలి..
ధన్పాల్ రాజేష్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ గోసంరక్షణ, పర్యావరణ సంరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం తమ సేవా సమితి కృషి చేస్తోందన్నారు. అలాగే, సేవాసమితి అధ్యక్షుడు సామ్రాట్ విక్రమాదిత్య, ఉపాధ్యక్షుడు ఉదయ్ భాస్కర్, అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోసేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామన్నారు. గోసేవా కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ సమయం వెచ్చించి పాల్గొనాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి..: Khilla Ramalayam Ropeway | ఖిల్లా రామాలయాన్ని సందర్శించిన అధికారులు.. రోప్‌వే ఏర్పాటు కోసం సమాలోచనలు