అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Bonalu Festival | నగరంలోని(Nizamabad) శివాజీనగర్ మున్నూరుకాపు సంఘం గాండ్ల తర్ప–1 ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తర్ప మహిళలు పెద్దఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.
Nizamabad Bonalu Festival | నగరంలోనూ పల్లె వాతావరణం ప్రతిబింబించేలా..
ఈ సందర్భంగా గాండ్ల తర్ప–1 పాలకవర్గ సభ్యులు శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం గాండ్ల తర్ప -1 పాలక వర్గం సభ్యులు రామర్తి గంగాధర్, గాండ్ల లింగం, శెట్టి రాజు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది దసరా దీపావళి మధ్య రెండో ఆదివారం బోనాల పండుగను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నగరంలోని పల్లె వాతావరణం ప్రతిబింబించేలా మహిళలు అందంగా ముస్తాబై బోనాల తీసి ఊరేగింపు నిర్వహించామన్నారు. శివాజీనగర్ మున్నూరుకాపు సంఘం ఏడు తర్పల ఆధ్వర్యంలో ఆదివారం బోనాలు పండుగ జరుగుతుందన్నారు. సంఘంలో వెయ్యి గడపలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున తర్ప సభ్యులు ఈ కడల పండుగలో పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తర్ప పెద్దకాపు రామర్తి రాజు, కోశాధికారి బొంపల్లి భూమయ్య, సంఘం మేనేజర్ రాజు, రామర్తి రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వెయ్యి మంది పోలీసులను అందుకే తెచ్చారు.. – జగన్