Nizamabad DCSO Suspension | రైస్​మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్​

నిజామాబాద్​ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు సివిల్​ సప్లయ్స్​ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad DCSO Suspension | నిజామాబాద్​ జిల్లా (Nizamabad) పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు సివిల్​ సప్లయ్స్​ శాఖ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad DCSO Suspension | రైస్​ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం కారణంగానే..

జిల్లాలో సీఎంఆర్​ దోపిడీ విచ్చలవిడిగా సాగింది. రూ.వేల కోట్లల్లో సీఎంఆర్​ను మింగేసిన రైస్​మిల్లర్ల బాగోతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించాయి. అయితే రైస్​మిల్లులలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడంపై సివిల్​ సప్లయ్స్​ శాఖ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు.

నిజామాబాద్​ డీసీఎస్​వో శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించిన ఏ అధికారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సివిల్ సప్లయ్స్​ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా పౌరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్​ ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

ఇది కూడా చదవండి: తాగిన మైకంలో సొంత ఇంటికే నిప్పు.. సిలిండర్ పేలుడుతో ఫైర్ ఆఫీసర్‌కు గాయాలు!  

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *