DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్​రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఆయన బినామీల ఇళ్లలో సోదాలు చేపట్టింది. 8 మంది బినామీల నివాసాల్లో గురువారం అధికారులు తనిఖీలు చేశారు.

డీఎస్పీ భీమ్​రెడ్డి (DSP Bhim Redd)పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గతంలో అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించారు. జూలై 2న 16 చోట్ల దాడులు నిర్వహించి, సుమారు రూ. 150-300 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను వెలికి తీశారు. ఇందులో విలాసవంతమైన విల్లా, ఫ్లాట్లు, 50 ఎకరాలకు పైగా భూమి, బంగారం, నగదు ఉన్నాయి. అయితే ఆయన బినామీల ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.

DSP Bhim Reddy | భారీగా నగదు స్వాధీనం

ఈ మేకు DSP భీమ్ రెడ్డికి సంబంధించిన 8 మంది బినామీలను ACB గుర్తించింది. ACB DSP గంగసాని శ్రీధర్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని పుప్పలగూడలో ఉన్న ఆ బినామీల ఇళ్లపై తాజాగా ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని పంచవటి కాలనీలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఆ DSPకి సంబంధించిన ఆస్తి పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Land Inquiry | రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *