Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్​ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

ఐదు రోజుల బ్యాంకింగ్​ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్​ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు యూనైటెడ్​ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్​ ఆధ్వర్యంలో (Nizamabad) జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు.

Five Day Banking | పనిఒత్తిడితో అల్లాడుతున్నాం

యూనియన్​ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్​బీఐ, సెబీ, ఎల్​ఐసీ వంటి సంస్థలకు ఇప్పటికే ఐదురోజుల పనివిధానం అమల్లో ఉందన్నారు. అయితే బ్యాంకులకు కూడా ఈ విధానం అమలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. బ్యాంకు ఉద్యోగులు పనివేళలు ముగిసినప్పటికీ ఆ రోజు పనిని పెండింగ్​లో పెట్టకుండా పూర్తిచేస్తున్నారన్నారు. సెలవు దినాల్లోనూ విధులు నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. సాంకేతికత పెరిగినా పనిభారం మాత్రం తగ్గడం లేదని వాపోయారు.  అలాగే ఎన్​పీఎస్​ స్థానంలో ఓపీఎస్​ అమలు చేయాలని.. పెన్షన్​ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. యూఎఫ్​బీయూ నిజామాబాద్​ యూనిట్​ కన్వీనర్​ రమేష్​, గురునాథ్​, రాజు, మనోజ్​ సింగ్​, వంశీ, సందీప్​, శ్రీనివాస్​ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Transformer Copper Theft | జల్సాల కోసం చోరీలు.. అన్నదమ్ముల ముఠా గుట్టురట్టు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *