Karnataka CM Meeting | కర్ణాటక సీఎంతో మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్​తో తెలంగాణ మంత్రుల బృందం మరోసారి భేటీ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka CM Meeting | కర్ణాటక సీఎం డీకే శివకుమార్​తో తెలంగాణ మంత్రుల బృందం బుధవారం మరోసారి భేటీ అయింది. మంత్రులు వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari), జూపల్లి కృష్ణారావులు, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం అయ్యారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని మంగళవారం మంత్రుల బృందం కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయమై మరోసారి ఆయనతో చర్చించారు. పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.

మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని కోరారు. మంత్రులు విజ్ఞప్తికి డీకే శివకుమార్‌ అంగీకారం తెలిపినట్లు సమాచారం.నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Modi US Visit | డిసెంబర్​లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *