Jawahar Navodaya Campus  | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

జక్రాన్​పల్లి మండలం కలిగోట్​లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్​ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jawahar Navodaya Campus | జక్రాన్​పల్లి మండలం కలిగోట్​లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్​ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం నిర్మాణ ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు.

Jawahar Navodaya Campus | నాణ్యతతో నిర్మించాలి..

జేవీఎన్ నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను కలెక్టర్​ (Collector Ila Tripathi) నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో వేగంగా జరిపించాలని, విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పనులు చేపట్టే సందర్భంగా ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. అటవీ శాఖతో పాటు ఇతర అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, ఎలాంటి సమస్యలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు.

Jawahar Navodaya Campus | బాలబాలికలకు వేర్వేరు హాస్టల్​ భవనాలు..

తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్ట్రర్స్ కోసం నిర్మించనున్న భవన సదుపాయాల బ్లూప్రింట్​ను కలెక్టర్​ పరిశీలించారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మొరం నిల్వలకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు.

Jawahar Navodaya Campus | అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..

మిషన్ భగీరథ నీటి వసతి, రోడ్డు, విద్యుత్ వంటి అన్ని వసతులు సకాలంలో అందుబాటులోకి రావాలని, విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఉండేలా ప్రహరీ నిర్మాణం చేపట్టాలని పాలనాధికారి దిశానిర్దేశం చేశారు. కనీసం రెండుమూడు వారాలకు ఒక పర్యాయం అయినా క్షేత్రస్థాయి సందర్శన జరుపుతూ, నిర్మాణ పనుల ప్రగతి గురించి తనకు నివేదించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Parle Biscuit Factory Clash | బిస్కెట్​ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *