Maize Crop Fire | మొక్కజొన్న పంట దగ్ధం.. పరిశీలించిన ఎమ్మెల్యే

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Crop Fire | మద్నూర్ మండలం (Madnur Mandal) శేఖాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి మొక్కజొన్న పంట దగ్ధమైంది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న రాశిని మంటలు అంటుకోవడంతో పంట పూర్తిగా కాలిపోయింది.

Maize Crop Fire | పరామర్శించిన ఎమ్మెల్యే..

ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) గురువారం ఉదయం గ్రామానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే, అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. పంటనష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

రైతులు (Farmers) ఎదుర్కొన్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Rural Health Development | గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *