vadodara gold theft | దసరా వేళ ప్రారంభానికి ముస్తాబు..కొత్త షోరూమ్‌లో 12 నిమిషాల్లోనే 5.5 కేజీల బంగారం మాయం!

షోరూమ్‌లో ఆభరణాలను డిస్‌ప్లే చేస్తున్న సమయంలో సేల్స్ మేనేజర్ కాసేపు చిన్న బ్రేక్ తీసుకుని పక్కకు వెళ్లారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: vadodara gold theft | దసరా పండుగను పురస్కరించుకుని వైభవంగా ప్రారంభం కావాల్సిన ఒక కొత్త ఆభరణాల దుకాణంలో భారీ దొంగతనం కలకలం రేపింది.

కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలో సుమారు 5.5 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

T20 Ticket Black Marketing | హైదరాబాద్‌లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!

vadodara gold theft | ఘటన ఎక్కడ జరిగింది?

గుజరాత్ Gujarat ​లోని వడోదర నగరంలో వాఘోడియా రోడ్, జావేర్ నగర్ సమీపంలో ఉన్న సాయి గణేష్ కాంప్లెక్స్‌లో ‘శ్రీ అంబికా జ్యువెల్లర్స్’ పేరుతో కొత్త షోరూమ్ ఏర్పాటయింది. దసరా సందర్భంగా ప్రారంభోత్సవానికి ఈ దుకాణం ముస్తాబైంది.

vadodara gold theft | మాయమైన పసిడి విలువ ఎంతంటే..

కాగా, ప్రదర్శన కోసం ఉంచిన రెండు బ్యాగుల్లోని బంగారం ఊహించని విధంగా మాయమైంది. మొత్తం 5.5 కేజీల బరువున్న ఈ ఆభరణాల విలువ సుమారు రూ.8.28 కోట్లు ఉంటుందని షోరూమ్ యజమానులు వెల్లడించారు.

ముంబైకి చెందిన ‘యుగన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న హిమాన్షు జైన్ ఈ వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. డాకోర్‌కు చెందిన ఆభరణాల దుకాణ యజమాని భవికుమార్ సోనీ కోరిక మేరకు.. వడోదరలో కొత్తగా ప్రారంభించనున్న షోరూమ్ కోసం హిమాన్షు జైన్ ఆదివారమే ఈ బంగారు ఆభరణాలను తీసుకువచ్చారు.

vadodara gold theft | దొంగతనం ఎలా జరిగింది?

షోరూమ్‌లో ఆభరణాలను డిస్‌ప్లే చేస్తున్న సమయంలో సేల్స్ మేనేజర్ కాసేపు చిన్న బ్రేక్ తీసుకుని పక్కకు వెళ్లారు. సరిగ్గా అదే అదనుగా భావించిన దుండగులు కేవలం 12 నిమిషాల్లోనే బంగారంతో ఉన్న రెండు బ్యాగులను ఎత్తుకెళ్లారు.

vadodara gold theft | పోలీసుల గాలింపు చర్యలు

బాధితుడు హిమాన్షు జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాపోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. దసరా సంబరాల వేళ కొత్త దుకాణంలో జరిగిన ఈ కోట్లాది రూపాయల భారీ చోరీ స్థానికంగా సంచలనం సృష్టించింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *