Heat Wave | మండుతున్న ఎండలు.. వడదెబ్బతో 22 మంది మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heat Wave | రాష్ట్రంలో హీట్​ వేవ్​ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట బయటక వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే అత్యవస పనులు ఉన్న వారు, కూలీ పనులు చేసుకునే వారు బయటకు వెళ్లక తప్పడం లేదు. దీంతో వీరు వడదెబ్బకు గురి అవుతున్నారు. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి చెందారు. భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు చనిపోయారు. అనేక జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

Heat Wave | నేడు పలు జిల్లాలకు అలెర్ట్​

నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్​, ఆసిఫాబాద్, ఆదిలాబాద్​, నిజామాబాద్​ (Nizamabad)లో 44–47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్​ ఉంది. అలాగే పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Heat Wave | అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు క్యాప్​, స్కార్ప్, రుమాలు వంటివి కట్టుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలి. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే నీడలోకి తీసుకెళ్లాలి. తడిబట్టతో శరీరాన్ని తుడవాలి. వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

ఇది కూడా చదవండి..: Dundigal POCSO Case | బాలికపై యువకుల లైంగిక దాడి.. నిందితులపై పొక్సో కేసు నమోదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *