KTR Kaleshwaram Visit | కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన కేటీఆర్​.. అడ్డుకుంటున్న పోలీసులు

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలు దేరిన కేటీఆర్​ను పోలీసులు అడ్డుకుంటున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Kaleshwaram Visit | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే ఆయనను అడుగడునా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రాలో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్ట్​లను నింపాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్​హౌజ్​ పరిశీలనకు బయలుదేరారు. ఆయన వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఒడితల సతీష్ కుమార్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

KTR Kaleshwaram Visit | బారికేడ్లు అడ్డుపెట్టి..

brs 1

కేటీఆర్​తో పాటు బీఆర్​ఎస్ (BRS)​ నాయకులను హైదరాబాద్ – వరంగల్ హైవే మీద పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వివాదం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్​కు చేతకాక పోతే కేసీఆర్ గారికి అప్పజెప్పాలన్నారు. మోటార్లు ఆన్ చేసి వారం రోజుల్లోపే అన్ని జలాశయాలు నింపి చూపెడుతామని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తూ.. వృథాగా పోతుంటే మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ నాయకులు వాగ్వాదం చేయడంతో కేటీఆర్​ను పోలీసులు అనుమతించారు.

KTR Kaleshwaram Visit | లారీలు అడ్డుపెట్టి..

పెంబర్తిని దాటి వచ్చిన కేటీఆర్​ను హైదరాబాద్ – వరంగల్ హైవేపై కోమల్ల టోల్ ప్లాజా వద్ద మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఏకంగా లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆయన కాన్వాయ్​ను ఆపారు. కేటీఆర్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటామన్నారు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడతామన్నారు.

 

దీనిని కూడా చదవండి : Paddy Bonus Guidelines | సన్నాలకు బోనస్​పై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు.. రైతులకు తిప్పలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *