Ponnam Prabhakar Challenge | ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి : మంత్రి పొన్నం

గురుకులాల్లో మొత్తం టెండర్లు రూ.1,143 కోట్లు అయితే రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Ponnam Prabhakar Challenge | మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు (Harish Rao), బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలపై ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. అందుకే తాము చర్చకు సిద్ధం గన్​పార్క్ వద్దకు వచ్చామని తెలిపారు.

మాజీ మంత్రులు ఆధారాలతో సహా వస్తే ప్రెస్ క్లబ్ కి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం టెండర్లు రూ.1,143 కోట్లు అయితే రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మఫాత్ లాల్ బట్టలు ధరించవద్దా అన్నారు. శాసనసభలో ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Ponnam Prabhakar Challenge | ప్రవీణ్​ కుమార్​ అవినీతి

ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ సెక్రెటరీగా సోషల్ వెల్ఫేర్​లో చేసిన అవినీతిపై విచారణ చేయాలని సీఎంకు లేఖలు రాస్తామన్నారు. తాము గురుకులాల టెండర్లపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తప్పించుకోవడం లేదని తెలిపారు. అయితే ఎవరికి పడితే వారికి జవాబు చెప్పాం అన్నారు. మాజీ మంత్రులు రావాలన్నారు. దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని రావాలని సూచించారు.

Ponnam Prabhakar Challenge | రాజీనామా చేస్తాం

మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే, దగ్గర ఆధారాలు చూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తామని పొన్నం ప్రభాకర్​ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని పని చేస్తున్నామని పేర్కొన్నారు. 327 గురుకులాలు ఉంటే అందులో కొన్ని బీఆర్​ఎస్​ నాయకులకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ ఒళ్ళు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *