CBSE Three Language | త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో మూడో భాషను అమలు చేసే అంశంపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Three Language | సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో మూడో భాషను అమలు చేసే అంశంపై సుప్రీంకోర్టు ( Supreme Court )ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తొమ్మిదో తరగతిలో కొత్తగా ఒక భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అనవసరమైన భారాన్ని, ఒత్తిడిని పెంచుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి బదులుగా, ఐదు లేదా ఆరో తరగతి నుంచే కొత్త భాషను బోధించడం సరైనదని సూచించింది.

CBSE Three Language | నేపథ్యం ఇదే..

తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా జేఎన్‌వీలలో ‘త్రిభాషా విధానం’ అమలులో ఉంది. అయితే, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో జేఎన్‌వీల ఏర్పాటుకు నిరాకరిస్తోంది.

suprim

CBSE Three Language | ప్రతి జిల్లాలో జేఎన్‌వీ ఏర్పాటు..

ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు ప్రతి జిల్లాలో జేఎన్‌వీ ఏర్పాటును సమర్థిస్తూ తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగానే త్రిభాషా విధానంపై కోర్టు పైవిధంగా స్పందించింది. సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని మరో ధర్మాసనం విడిగా విచారణ జరుపుతోందని కోర్టు పేర్కొంది.మరోవైపు, వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై కూడా హైకోర్టు స్పందిస్తూ.. ఆయనను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి:  Bodhan Encroachment Removal | బోధన్​ పట్టణంలో రోడ్లపై ఆక్రమణల తొలగింపు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *