Sitarama Lift Irrigation | చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sitarama Lift Irrigation | గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు.

ప్రపంచ వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుగానే సన్నద్ధమవుతోందని, ఆ దిశగా వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. మూడు రోజుల క్రితం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని సమ్మక్క బ్యారేజీ బ్యాక్ వాటర్స్ వద్ద పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసేందుకు అన్ని పంపులను ఆన్ చేశామన్నారు.

Sitarama Lift Irrigation | పనులు వేగవంతం చేయాలి

Sitarama Lift Irrigation

సీతారామ ప్రాజెక్టును కూడా సందర్శించి, సమీక్ష నిర్వహించామని తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలను అందించాలనే ఉద్దేశంతో లోతైన అధ్యయనం చేసి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రూపొందించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి మరో రూ.1,505 కోట్లు మాత్రమే అవసరమైనప్పటికీ, కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దురుద్దేశంతో వాటిని రీడిజైన్ (పునఃరూపకల్పన) చేసిందని ఆరోపించారు. దీంతో సీతమ్మ సాగర్ బ్యారేజీతో కలిపి ప్రాజెక్ట్ వ్యయం దాదాపు రూ.24 వేల కోట్లకు పెరిగిందన్నారు.

ఇది కూడా చదవండి..:  Golconda Bonalu 2026 | గోల్కొండలో బోనాల సందడి.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *