Congress Education Priority | రాష్ట్రంలో విద్యకు కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్దపీట : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Education Priority | విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు.

నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్​లో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల(Young India School) భవన నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi)తో కలిసి శంకుస్థాపన చేశారు.

Congress Education Priority | జిల్లాలో రూ.20కోట్లతో..

జిల్లాలోని పాఠశాలల్లో విద్యర్థుల కోసం రూ.20 కోట్లతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తున్నారని.. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలన్నారు.

10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించిన విజయసాయిని అభినందించారు. అనంతరం రూ.3.50 కోట్ల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.

Congress Education Priority | బాగా చదువుకోవాలి..

ఈ సందర్బంగా కలెక్టర్ ఇలా మట్లాడుతూ తాను పాలనాధికారిగా ఉన్న సమయంలో యంగ్​ ఇండియా స్కూల్​ ఏర్పాటుకు ముహూర్తం కుదరడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుకుని ప్రయోజకులు కావాలని ఆశిస్తున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తామన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు.

కాంట్రాక్టర్లు భవనాన్ని నాణ్యతతో నిర్మించాలన్నారు. విద్యార్థులను కలవడానికి వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్, సర్పంచి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

11 3

ఇది కూడా చదవండి: Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *