Illegal Ventures | అక్రమ వెంచర్లకు మున్సిపల్ అధికారుల చెక్.. జేసీబీలతో కూల్చివేతలు

ప్రభుత్వ, డీటీసీపీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై కామారెడ్డి మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Ventures | ప్రభుత్వ, డీటీసీపీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై కామారెడ్డి మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని 7వ వార్డులో ఓ వెంచర్​పై  చర్యలు చేపట్టారు.

Illegal Ventures | అనుమతులు లేకుండానే..

పట్టణంలోని 7వ వార్డు వికాస్‌నగర్ కాలనీలో సర్వే నంబర్లు 672, 675, 676, 677, 678లో కలిపి దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో రెండు వెంచర్లను కొందరు రియల్టర్లు ఏర్పాటు చేశారు. కనీస అనుమతులు లేకుండానే రోడ్లు వేసి, ప్లాట్లుగా విభజించి అమ్మకాలకు సిద్ధమవుతుండగా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టౌన్ ప్లానింగ్ అధికారి వినిత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయమే పోలీసు బలగాలతో కలిసి జేసీబీలు వెంచర్ల వద్దకు చేరుకున్నాయి. పోలీసుల సమక్షంలో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అందులో రోడ్లను తొలగించారు.

Illegal Ventures | ఎలాంటి అనుమతుల్లేవ్​..

కమిషనర్ మాట్లాడుతూ.. సంబంధిత వెంచర్లకు డీటీసీపీ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ వెంచర్ నిర్వాహకులు పట్టించుకోలేదని, బలవంతంగా నిర్మాణాలు కొనసాగిస్తుండటంతో చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో ఇంకా పలు చోట్ల అనుమతులు లేని లేఔట్లు వెలుస్తున్నాయని తమ వద్ద సమాచారం ఉందని, వాటిపైనా దశలవారీగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థలం చౌకగా ఉందన్న ఆశతో అనుమతులు లేని ప్లాట్ల జోలికి వెళ్లి తర్వాత ఇబ్బంది పడవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు పొందిన వెంచర్లలోనే పెట్టుబడి పెట్టాలని, లేకుంటే రూ.కోట్లు పెట్టి కొన్న ప్లాట్లు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. త్వరలో పట్టణంలోని అనుమతులు ఉన్న వెంచర్లు, లేని వెంచర్లకు సంబందించిన వివరాలను మున్సిపల్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhari Land Encroachment | కబ్జా కోరల్లో బీడీ కార్మికుల భూమి.. ఫిర్యాదు చేస్తామంటున్న లబ్ధిదారులు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *