ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్​ రికార్డ్స్​ సూపరింటెండెంట్​

లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్​లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid Mahabubnagar | మ్యుటేషన్ ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ (Mahabubnagar) కలెక్టరేట్​లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ సిబ్బంది, ఆఫీస్‌లోనే ఆయన లంచం డబ్బులు తీసుకుంటుండగా అరెస్ట్​ చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా బూత్‌పూర్ మండలం కర్వేన గ్రామానికి సంబంధించిన గ్రామ పటంలో సవరణలు చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, భూ రికార్డుల)కు ఫైలు సమర్పించడం కోసం కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్‌ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లంచం డిమాండ్​ చేశాడు. రూ.15 వేలు ఇస్తేనే పనులు చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి బుధవారం లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.

ACB Raid Mahabubnagar | లంచం ఇవ్వొద్దు

acb raid

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Anganwadi Jobs | నిరుద్యోగ మహిళలకు గుడ్​న్యూస్​.. అంగన్​వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *