Medchal Terrorist Arrest | మేడ్చల్‌లో ఉగ్ర కలకలం.. పాక్ ‘ఐఎస్ఐ’తో సంబంధాల వ్యక్తి అరెస్టు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Medchal Terrorist Arrest | హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌లో ఉగ్రవాద లింకుల కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో పాటు ఇతర ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఒక అనుమానితుడిని పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం… ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి కొంతకాలంగా మేడ్చల్‌లోని ‘ముబారక్ హోటల్’లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. హోటల్ పనిలో ఉంటూనే అతను తెర వెనుక ప్రమాదకరమైన కార్యకలాపాలకు తెరలేపాడు.

Medchal Terrorist Arrest | ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాదులతో లింకులు

జయీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రతినిధులు, ఇతర ఉగ్రవాద శక్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

దేశంలో అలజడి సృష్టించేందుకు లేదా ఏదైనా పెద్ద నెట్‌వర్క్‌లో భాగం అయ్యేందుకు అతను ఆయుధాలను సమకూర్చుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు విచారణలో తేలింది.

akshara today .jpgterror

Medchal Terrorist Arrest | సెల్‌ఫోన్ సీజ్.. విస్తుపోయే నిజాలు!

నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఉగ్రవాద సంస్థలకు చెందిన వారితో జరిపిన ఛాటింగ్ హిస్టరీ లభ్యమైంది.

దేశ వ్యతిరేక శక్తులతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్‌లు, కీలకమైన స్క్రీన్‌షాట్లను పోలీసులు రికవరీ చేశారు.

నిందితుడి నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని దేనికోసం ఉపయోగించాలనుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Medchal Terrorist Arrest | పోలీసుల హెచ్చరిక

స్థానిక హోటళ్లు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల వ్యక్తుల వివరాల (ID Proofs) పై యాజమాన్యాలు కచ్చితంగా నిఘా ఉంచాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు సూచించారు.

ప్రస్తుతం నిందితుడిని పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. అతని వెనుక ఉన్న స్థానిక నెట్‌వర్క్ ఏంటి? అతనికి ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్టుతో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

Modi Economic Strategy | ఆర్థిక క్రమశిక్షణే ఆయుధం.. మోడీ ‘లైఫ్‌స్టైల్’ మంత్రం వెనుక దాగి ఉన్న వ్యూహం ఇదేనా?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *