అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Diwali Greetings | దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్ ప్రతినిధులు పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో(Nizamabad) శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
Nizamabad Diwali Greetings |కలెక్టర్ ఇలా త్రిపాఠికి..
ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్, కార్యదర్శి శ్రీ నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు, మరో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) రాజారెడ్డి, డీఆర్వో గీతను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షుడు శివకుమార్ గౌడ్, జాఫర్ హుస్సేన్, అర్బన్ సెక్రెటరీ మారుతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అమావాస్య రోజు ‘ఆకాశ దీపం’ ఎందుకు వెలిగిస్తారు?