Yellareddy Heavy Rain | ఎల్లారెడ్డిలో భారీ వర్షం.. విరిగిపడ్డ చెట్లు, తడిసిన ధాన్యం రాశులు..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Heavy Rain | ఎల్లారెడ్డి (Yellareddy) మండలంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కుప్పలు (paddy crop) తడిసి ముద్దయ్యాయి. ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు సైతం ఈదురు గాలులకు ఎగిరిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. చేతికందిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు.

Yellareddy Heavy Rain | భారీ ఈదురుగాలులు

బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి ఎల్లారెడ్డి–కామారెడ్డి (Yellareddy-kamareddy) ప్రధాన రహదారిపై అనేక చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రోడ్డుపై భారీగా కొమ్మలు పడడంతో రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై పడిన చెట్లకొమ్మలు తొలగించాలని వారు కోరుతున్నారు. ఈదురు గాలులకు గండి మాసానిపేట్​ గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలను పునరుద్ధరించి కరెంటు సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పలుచోట్ల రేకుల షెడ్లు సైతం ధ్వంసమయ్యాయి.

Yellareddy Heavy Rain | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణశాఖ మరో రెండు రోజులు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై పడిన కొమ్మలను పూర్తిగా తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

1 1 2 4 5

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *