అక్షరటుడే, కామారెడ్డి : Fishing Net Tragedy | చెరువులో చేపలు పట్టడానికి వలతో వెళ్లిన యువకుడు అదే వలలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పెద్ద చెరువులో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బోడదారి స్వామి(25) బుధవారం సాయంత్రం కామారెడ్డి పెద్ద చెరువు (Pedda cheruvu)లో చేపలు పట్టడానికి వల తీసుకుని బయలుదేరాడు. చేపల కోసం వల వేసిన స్వామి ప్రమాదవశాత్తు అదే వలలో చిక్కుకున్నాడు. అందులోంచి బయటకు రాలేక ఊపిరాడక మృతి చెందాడు.
Fishing Net Tragedy | కేసు నమోదు
స్వామి మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కాగా స్వామి తల్లి పదేళ్ల క్రితం చనిపోగా తండ్రి మిషన్ భగీరథలో పని చేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తండ్రి రోదన అందరిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Woman Death Kamareddy | కూలీకి వెళ్లిన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి
