అక్షరటుడే, ఎల్లారెడ్డి : Junior Lecturers | దశాబ్ద కాలంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎదురుచూస్తున్న ‘కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (CAS) కోసం జూనియర్ లెక్చరర్ సర్వీస్‌ను కౌంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. జేఎల్ సర్వీస్‌ను CAS లెక్కలోకి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిగ్రీ అధ్యాపకుల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరింది.
Junior Lecturers | టీజీసీజీటీఏ కృషితో..
ఈ ఉత్తర్వుల సాధన కోసం కళాశాల విద్య జేఏసీ ఛైర్మన్, టీజీసీజీటీఏ ప్రధాన కార్యదర్శి డా. కె. సురేందర్ రెడ్డి కృషి చేశారు. ఆయన నిబద్ధత, అంకితభావంతో చేసిన కృషి ఫలితంగా ఈ జీవో సాధ్యమైందని అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా టీజీసీజీటీఏ ఆధ్వర్యంలో అధ్యాపకులు సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవో విడుదలకు కృషి చేసిన టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. గోపి, ఉపాధ్యక్షుడు జె. చిన్నా, కోశాధికారి ఎన్. రమేశ్ గౌడ్, మహిళా కార్యదర్శి ఈ. పావని తదితర రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా టీజీసీజీటీఏ అధ్యక్షుడు ఎన్. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. శివకుమార్ మాట్లాడుతూ డిగ్రీ అధ్యాపకుల సమస్య పరిష్కారానికి సురేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంతో కృషి చేశారన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana National Highway | తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్‌కు మహర్దశ : రూ.7,597 కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం
