తెలంగాణNirmal Fire Accident | వరి కొయ్య అగ్ని కీలల బీభత్సం.. 300 ఎకరాలకు వ్యాపించిన...

Nirmal Fire Accident | వరి కొయ్య అగ్ని కీలల బీభత్సం.. 300 ఎకరాలకు వ్యాపించిన మంటలు

ఇప్పటి వరకు 300 ఎకరాల మేర విస్తరించాయి. మంటల తీవ్రతతకు సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకుంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nirmal Fire Accident | నిర్మల్ జిల్లాలో వ్యాపించిన అగ్ని కీలలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయిఇ. సోన్ సమీపంలోని పంటపొలాల్లో ఎగసిపడిన మంటలు వందలాది ఎకరాలను కాలిబూడిద చేశాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన తెలివి తక్కువ పనికి అన్నదాతలు నిలువునా నష్టపోయారు.

Nirmal Fire Accident | క్షణాల వ్యవధిలో..

స్థానికుల వివరాల ప్రకారం.. స్టోన్ సమీపంలోని ఓ పంట పొలంలో వరి కోతల అనంతరం మిగతా కొయ్యలకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. కాగా, ఆ సమయంలో ఈదురుగాలులు వీయడంతో మంటలు క్షణాల వ్యవధిలో చుట్టుపక్కల పొలాలకు వ్యాపించాయి.

గాలుల తీవ్రతకు అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు 300 ఎకరాల మేర విస్తరించాయి. మంటల తీవ్రతతకు సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకుంది.

ఈ అగ్నిప్రమాదంలో పంట పొలాల్లోని అనేక బోరు బావుల మోటర్లు, పైపులైన్లు పూర్తిగా కాలిపోయాయి. కంటి ఎదుటే కష్టార్జితం, రూ.లక్షల విలువైన వ్యవసాయ సామగ్రి అగ్నికి ఆహుతైపోవడంతో కర్షకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భారీగా నష్టం వాటిల్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Bharat Pak Border Video | ఆకాశం నుంచి మెరిసిన భారత్-పాక్ సరిహద్దు.. నెట్టింట వైరల్ అవుతున్న ఇండిగో పైలట్ వీడియో!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...

New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Pensions | రాష్ట్ర ప్రభుత్వం (State Government)...

Bhupathi Reddy Warning | చెరువులను కబ్జా చేస్తే చర్యలు తప్పవు: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Bhupathi Reddy Warning | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో...

Skoda Epiq EV | సింగిల్ ఛార్జ్​తో 440 కిలోమీటర్లు.. త్వరలో మార్కెట్ లోకి స్కోడా కొత్త ఈవీ కారు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Skoda Epiq EV | ప్రముఖ కార్ల తయారీ...