అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Comments Revanth | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు మండి పడుతున్నారు. నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కరువు వచ్చిందని, నీళ్లు ఎలా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీంతో వారిని కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ఇంకా రక్తదాహం తీరలేదా అని ప్రశ్నించారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు సరిపోలేదా అన్నారు.
KTR Comments Revanth | ఇంకెంత రక్తం కావాలి
తెలంగాణ రక్తం రుచిమరిగిన కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు కాంగ్రెస్ నాయకులని ఆరోపించారు. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపారని, 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించారని గుర్తు చేశారు. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయన్నారు.
KTR Comments Revanth | నీళ్లు ఇవ్వు
‘నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు’ అని కేటీఆర్ సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే తమ రక్తం ధారపోస్తామని పేర్కొన్నారు. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చాలని కోరారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్నారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
దీనిని కూడా చదవండి : Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు