అక్షరటుడే, ఇందూరు: Induru Dance Artists | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఇందూరు నగరానికి చెందిన కళాకారులు పేరిణి నాట్యం, తాండవం చేసి తమ ప్రతిభను చాటారు.
Induru Dance Artists | నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమల (Tirumala)లో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నగరంలోని ధనిత డ్యాన్స్ అకాడమీ గురువు పేరిణి సతీష్ ఆధ్వర్యంలో 45మంది అద్భుతమైన పేరిణి నృత్యం, తాండవం చేశారు. రమాదేవి బృందంలో వేంకటేశ్వర స్వామి గెటప్లో తోట వైనవి, గోదాదేవిగా హర్షిత, లక్ష్మీదేవిగా సాయి సుధేష్ణ, శివుడిగా శ్రీహిత, పార్వతిగా సహస్ర తమ అభినయాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో రవిచంద్ర నృత్యాకళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి..: Suresh Babu DRUCC Member | దక్షిణ మధ్య రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడిగా గోండాల సురేష్ బాబు