Nizamabad RTA Home Guards | రవాణాశాఖ నుంచి ఇద్దరు హోంగార్డుల సరెండర్​

నిజామాబాద్​ జిల్లా రవాణా శాఖ నుంచి ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు సరెండర్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad RTA Home Guards | జిల్లా(Nizamabad) రవాణా శాఖ నుంచి ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు సరెండర్​ చేశారు. ఈ మేరకు డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గాప్రమీల (DTC Durga Pramila) వివరాలు వెల్లడించారు.

Nizamabad RTA Home Guards | అవినీతి ఆరోపణల నేపథ్యంలో..

కొన్నేళ్లుగా ఆర్టీఏ పరిధిలోని ఆర్మూర్​ యూనిట్​లో హోంగార్డు బి. దశరథ్​ పనిచేస్తుండగా.. మరో హోంగార్డు భాస్కర్​ ఉమ్మడి జిల్లా మొబైల్​ స్క్వాడ్​లో విధుల్లో ఉన్నారు. వీరిద్దరిపై వస్తున్న అవినీతి ఆరోపణలు వచ్చాయని.. విచారించిన అనంతరం వారిని వారి మాతృశాఖ అయిన నిజామాబాద్​ కమిషనరేట్​కు సరెండర్ చేశామని కమిషనర్​ తెలిపారు. 2008, ఆ తర్వాత రిక్రూట్​మెంట్​ అయిన ఈ హొంగార్డులు కొన్నేళ్లుగా ఆర్టీఏ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్నారని.. వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల నిరసన 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *