PDSU Protest | పీసీసీ చీఫ్​ ఇంటి ముట్టడికి పీడీఎస్​యూ యత్నం.. పలువురి అరెస్ట్​

ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : PDSU Protest | ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం నగరంలోని (Nizamabad) పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ ​(PCC Chief)ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

PDSU Protest | బకాయిలు విడుదల చేయాలి

నగరంలోని నాల్గో టౌన్​ పరిధిలోని బస్వా గార్డెన్​ సమీపంలో ఉన్న పీసీసీ చీఫ్​ ఇంటికి పీడీఎస్​యూ నాయకులు చేరుకున్నారు. ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్​ పోలీసులు వెంటనే స్పందించారు. పీడీఎస్​యూ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీ​స్​స్టేషన్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: AP DSC Recruitment 2026 | అసెంబ్లీలో నారా లోకేశ్ కీలక ప్రకటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *