అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (Keesara CI) అర్కపల్లి ఆంజనేయులు ఇళ్లలో ఏసీబీ (ACB) అధికారులు శనివారం సోదాలు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
కీసర సీఐ ఆంజనేయులు సెప్టెంబర్ 16న ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతడిని సెప్టెంబర్ 17 అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆయన చంచల్గూడ సెంట్రల్ జైలు (Central Jail)లో ఉన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు శనివారం ఆయన నివాసాలతో పాటు బినామీలు, సహచరులు ఇళ్లలో సోదాలు చేశారు.
ACB Raids | భారీగా అక్రమాస్తులు
తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. సరూర్నగర్లోని లింగోజిగూడలో పాత ఇల్లు ఉన్న 150 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు, ఎల్.బి. నగర్లోని మన్సూరాబాద్, సి.ఆర్. ఎన్క్లేవ్లో 240 చదరపు గజాల ఒక పాత ఇల్లు, పెరూర్ గ్రామంలో ఉన్న 180 చదరపు గజాల నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు, మిర్యాల్గూడలోని హాలియాలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. సోదాల సమయంలో రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రూ.2.28 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
దీనిని కూడా చదవండి : Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య