అక్షరటుడే, వెబ్డెస్క్: TGPSC HMWSSB Manager Notification | తెలంగాణ Telangana లో ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పరిధిలో 130 మేనేజర్ (ఇంజనీరింగ్) ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల జారీ చేసింది.
Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!
TGPSC HMWSSB Manager Notification | ముఖ్యమైన వివరాలు..
- మొత్తం ఖాళీలు: 130 మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టులు (మల్టీ జోన్ – II పరిధిలోకి వస్తాయి).
- జీతం (పే స్కేల్): ₹54,220 నుంచి ₹1,33,630 వరకు ఉంటుంది.
- వయోపరిమితి: 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు (నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది).
TGPSC HMWSSB Manager Notification | దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచంటే?
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: సెప్టెంబరు 23
- చివరి తేదీ: అక్టోబరు 17 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- రాత పరీక్ష: ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను డిసెంబరు నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
ఆసక్తి గల అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
TGPSC HMWSSB Manager Notification | పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలు ఖరారు!
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా భర్తీ చేయనున్న 7,437 పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.
- ఎస్ఐ (SI) పరీక్ష తేదీ: నవంబర్ 29
- కానిస్టేబుల్ (Constable) పరీక్ష తేదీ: డిసెంబర్ 20
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలని అధికారులు సూచించారు.