అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Kavitha TRS | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్ఎస్(TRS Nizamabad) పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
Kavitha TRS | ప్రశాంత్‌రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు..
నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసన్నారు. బస్వాపూర్ క్వారీలో జరిగిన అక్రమాలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ప్రశాంత్‌రెడ్డి ఆటలు ఇక సాగవని పేర్కొన్నారు. జిల్లా నాయకులు దొంత ప్రవీణ్ మాట్లాడుతూ.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్లో కవిత ఉన్నప్పుడు షకీల్ ఎన్నో పనులు చేయించుకున్నారన్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
జిల్లా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తామని చెప్పి చేతులెత్తేయడం ఒక్క బీజేపీ ఎంపీ అర్వింద్‌కే సాధ్యమన్నారు. మాధవనగర్ వంతెన పనులు ఆలస్యం కావడంతో ఎంపీ పాత్ర ఉందన్నారు. రూరల్ నాయకుడు నరేష్ మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్ ఏం మాట్లాడుతారో ఆయనే తెలియదన్నారు. జిల్లా నాయకులు హద్దుల్లో ఉండి మాట్లాడాలని లేకపోతే వారిని తిరగనివ్వమన్నారు.
ఇది కూడా చదవండి: TGSRTCలో కండక్టర్ పోస్టులు..!