Mamunur Airport | కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ కీలక చర్చలు..

తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamunur Airport | తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్, వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌లపై ప్రధానంగా చర్చించారు.

Mamunur Airport | శంకుస్థాపన తేదీ ఖరారు..

మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను ఇప్పటికే పూర్తి చేసి అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ విజ్ఞటనపై సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు.. రాబోయే రెండు వారాల్లో మామునూరు ఎయిర్‌పోర్ట్ టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, అదే నెలలో పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

Mamunur Airport | రన్‌వే ఖరారు ప్రక్రియ..

ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు కల్పించాలని సీఎం కోరారు. అంతేకాకుండా, రన్‌వే ఖరారు ప్రక్రియ కోసం రక్షణ పౌర విమానయాన శాఖల అధికారులతో ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Mamunur Airport | సీ ప్లేన్ ప్రాజెక్ట్‌పై ఫోకస్..

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా హెలికాప్టర్ల (ఛాపర్లు) ద్వారా హెలీ టూరిజాన్ని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేశారు. మరోవైపు, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Konda Surekha Comments | సీఎం రేవంత్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *