అక్షరటుడే వెబ్‌డెస్క్: Amazon Diwali Sale | పండుగల వేళ షాపింగ్ ప్రియులకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తీపి కబురు అందించింది. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలీ ఎడిషన్’ పేరిట భారీ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ , గృహ నిత్యావసర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులు, అదనపు క్యాష్‌బ్యాక్‌లు , మెరుపు వేగంతో డెలివరీలను కస్టమర్లకు అందిస్తోంది.
Amazon Diwali Sale | బ్యాంక్ ఆఫర్లు ..
షాపింగ్‌ను మరింత లాభదాయకంగా మార్చేందుకు బ్యాంకింగ్ ప్రయోజనాలను ప్రకటించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు , EMI లావాదేవీలపై 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై అదనంగా రూ. 250 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంతేకాకుండా, చెక్అవుట్ వద్ద రూ.50,000 పైబడిన కొనుగోళ్ల కోసం ₹3.5 లక్షల వరకు పరిమితితో కూడిన ‘షాపింగ్ లోన్’ (Shopping Loan) కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 24 నెలల సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించింది.
Amazon Diwali Sale | 80% వరకు తగ్గింపు..
వివిధ కేటగిరీల్లో టాప్ బ్రాండ్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, సోనీ, క్యానన్ వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లపై 80% వరకు, స్మార్ట్ఫోన్లపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్ విభాగంలో క్రోక్స్, స్కెచర్స్, లాక్మే, గ్యాప్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 80% వరకు ఆదా చేసుకోవచ్చు. గృహ వంటగది అవసరాల కోసం బోష్, నింజా బ్రాండ్లకు చెందిన లక్షకు పైగా ఉత్పత్తులపై ఫ్లాట్ 50% డిస్కౌంట్ అందిస్తున్నారు.
Amazon Diwali Sale | షాపింగ్ మరింత సులభం..
షాపింగ్ అనుభవాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు AI ఆధారిత చాట్‌బాట్ ‘రూఫస్’ (Rufus)ను అమెజాన్ వినియోగిస్తోంది. బడ్జెట్‌కు తగిన బహుమతుల ఎంపిక, ఉత్పత్తుల ధరల చరిత్ర (Price History) విశ్లేషణ, ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది. అదేవిధంగా, లెన్స్ AI సాయంతో ప్రొడక్ట్ ఫోటో తీసి తక్షణమే సెర్చ్ చేసే వెసులుబాటు కల్పించారు.
Amazon Diwali Sale | నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ..
వైజాగ్ ( Vizag ) సహా దేశవ్యాప్తంగా 120కి పైగా ప్రధాన నగరాల్లో ‘అమెజాన్ నౌ’ (Amazon Now) ద్వారా మెరుపు వేగంతో సేవలు అందిస్తున్నారు. కిరాణా సరుకులు, నిత్యావసరాలు, సౌందర్య ఉత్పత్తులను ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే నేరుగా కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు. ఈ విభాగంలో కిరాణా వస్తువులపై 50% వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Ghaziabad Wife Murder Plot | జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. భర్త హత్యకు భార్య స్కెచ్ ..!