అక్షరటుడే, నందిపేట్: Yoga Competitions | సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు, యోగా ఎంతో ముఖ్యమని జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ అన్నారు. నందిపేట్ (Nandipet) మండల కేంద్రంలో నిర్వహించిన 17వ జిల్లాస్థాయి యోగా (Yoga) పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Yoga Competitions | విజయవంతంగా పోటీలు..
డీఎస్డీవో మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. నందిపేట్ మండలంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామన్నారు. నందిపేటలో క్రీడా ప్రాంగణం నిర్వహణకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగన్న మాట్లాడుతూ నందిపేట్‌లో ఇలాంటి యోగా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉండని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలు కూడా నందిపేట్ లో నిర్వహించాలని, అందుకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ట్రస్మా అధ్యక్షుడు, ఉజ్వల స్కూల్ కరస్పాండెంట్ అరుణ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి యోగా పోటీలు తమ పాఠశాలలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.
Yoga Competitions | 400మంది క్రీడాకారులు
పోటీలకు తెలంగాణ యోగా సంఘం తరఫున అబ్జర్వర్లుగా ఉప్పు రవీందర్, పోతన పాల్గొన్నారు. యోగా సంఘం అధ్యక్షురాలు ఐశ్వర్య మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. యోగా సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్ మెడల్స్ అందజేశారు. ఈ పోటీలో గెలుపొందిన మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి దాదాపుగా 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వైఎస్సార్‌కు నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి