HP Gas Tanker Accident | అదుపుతప్పి బోల్తాపడ్డ హెచ్‌పీ గ్యాస్ ట్యాంకర్.. తప్పిన ప్రమాదం

హెచ్​పీ గ్యాస్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : HP Gas Tanker Accident | హెచ్​పీ గ్యాస్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై (Kamareddy) శనివారం చోటుచేసుకుంది.

HP Gas Tanker Accident | లారీడ్రైవర్​కు గాయాలు..

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ట్యాంకర్​కు ఎటువంటి లీకేజీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన డ్రైవర్ ను పోలీసులు చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ బోల్తా పడిన ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ట్యాంకర్ హైదరాబాద్ లోని చర్లపల్లిలో గ్యాస్ లోడ్ నింపుకొని నాగపూర్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ నాదే….. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *