అక్షరటుడే, వెబ్డెస్క్ : DUSU Election Results | ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) ఎన్నికల్లో ఏబీవీపీ (ABVP) ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు పదవులకు జరిగిన ఎన్నికల్లో మూడు పదవులను గెలుచుకుంది.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 20 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టారు. అధ్యక్ష పదవి కోసం ఏబీవీపీ, ఎన్ఎస్యూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆధిక్యం తక్కువగా ఉండటంతో ఎవరు గెలుస్తారోనని చివరి వరకు ఉత్కంఠ నెలకొనంది. చివరకు ఏబీవీపీ నుంచి పోటీ చేసిన యశ్దబాస్ గెలుపొందారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుపొందగా.. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకోవడం విశేశం.
DUSU Election Results | ఎన్ఎస్యూఐ పరాజయం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విభాగమైన ఎన్ఎస్యూఐ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. ABVPకి చెందిన యశ్ దబాస్ 24,576 ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఆయన ఎన్ఎస్యూఐకి చెందిన విజయ్ శంకర్ మీనా (22,523 ఓట్లు) పై గెలుపొందారు. రియా ఛావ్‌డీ 21,650 ఓట్లతో కార్యదర్శి పదవిని, లక్ష్య రాజ్ సింగ్ 16,615 ఓట్లతో సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఎన్ఎస్యూఐ సభ్యుడు దీపాంశు షోకీన్ 30,615 ఓట్లతో ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అధ్యక్షుడిగా గెలిచిన యశ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : KTR Janwada Farmhouse | మేం తప్పు చేస్తే.. ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం : కేటీఆర్