అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Nizamabad Cheetah Force | నగరంలో (Nizamabad) అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో వ్యభిచార గృహాలపై శనివారం దాడులు నిర్వహించారు.
Nizamabad Cheetah Force | మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
నగంరలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పలు గృహాల్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో చీతా ఫోర్స్ టీం దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలతో పాటు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చీతాఫోర్స్ సభ్యులు మాట్లాడుతూ.. తమ ఏరియాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, లేదా 112కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ నాదే…..