Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైం

Arunachalam Incident | అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఘోరం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 11:22 am 11:22 am
Srinivas Kolluri
Share
Arunachalam Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arunachalam Incident | అరుణచలం గిరి ప్రదక్షిణ దారిలో ఘోరం జరిగింది. ఇద్దరు యువతులపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా వారి వీడియోలు తీసి బ్లాక్​ మెయిలింగ్​ చేశారు.

తమిళనాడు (Tamil Nadu)లోని అరుణచలం క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది దర్శించుకుంటున్నారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. దాదాపు 14 కిలోమీటర్లు నడుస్తారు. ఆ సమయంలో భక్తులు పలు గ్రామాలు, అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొందరు రెచ్చిపోతున్నారు. గతంలో పలువురిపై దాడులకు పాల్పడ్డారు. తెలంగాణకు చెందిన ఓ భక్తుడిని దుండగులు హత్య చేశారు. తాజాగా ఇద్దరు యువతులపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు.

Arunachalam Incident | ఒకే ముఠా

తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి గిరిప్రదక్షిణకు గత నెల 30న వచ్చింది. ఆమె స్నేహితులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం కాగా.. ఆ మహిళ, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు ఆయుధాలతో వారి వద్దకు వచ్చారు. వారిని బెదిరించి వివాహితను అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇద్దరి దుస్తులు తీసేసి నగ్నంగా వీడియోలు తీసి పారిపోయారు. అనంతరం ఆ వీడియోలు పంపి రూ.లక్ష పంపాలని ముఠా సభ్యులు డిమాండ్​ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Arunachalam Incident | మరో యువతిపై..

తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా అలసిపోయి అడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుంది. తన స్నేహితుడిని అక్కడకు రావాలని పిలిచింది. అనంతరం ఇద్దరు ఓ హోటల్​లో టిఫిన్ పార్సిల్ తీసుకుని వెళ్లి తింటుండగా ఓ ముఠా ఇద్దరినీ బెదిరించింది. అడవిలోకి తీసుకెళ్లి యవతిపై అత్యాచారానికి పాల్పడింది. యువతి చెవికి ఉన్న బంగారు కమ్మలు తీసుకోవడంతో పాటు వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడ నుండి దుండగులు పారిపోయారు. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యదు చేసింది.

Arunachalam Incident | ప్రత్యేక బృందాలతో..

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఇద్దరిపై గ్యాంగ్​ రేప్​ జరగడంతో పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. మొత్తం 11 మంది నిందితుల‌ను గుర్తించారు. అందులో 8మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వాసుదేవన్, ఆకాష్, అశ్వనాథశురనై, అప్పు, హరిహరన్, శర్మ, అరుణ్ కుమార్, శివగణేశన్​గా గుర్తించారు. వీరితో పాటు ఓ బాలుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

TAGGED:Arunachalam GirivalamArunachalam IncidentArunachalam TempleGang Rape Casepolice investigationTamil Nadu CrimeTiruvannamalai Newswomen safety
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Janhvi Kapoor Tirumala Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్​
Next Article Ebola Outbreak Congo Ebola Outbreak Congo | ఎబోలా విజృంభణ వేళ.. ఐసోలేషన్ నుంచి 11 మంది పరార్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Highway Robbery Arrest |
క్రైంనిజామాబాద్

Highway Robbery gang Arrest | దారి దోపిడీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

By Shashi kiran Mottala
Anakapalle Bus Accident
ఆంధ్రప్రదేశ్​క్రైం

Anakapalle Bus Accident | నక్కపల్లి సమీపంలో బస్సు బోల్తా.. త‌ప్పిన పెను ప్ర‌మాదం, 20 మందికి గాయాలు

By Srinivas Kolluri
Tanuja Murder Case
క్రైం

Tanuja Murder Case | రిటైర్డ్​ ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

By Shivam nagarani
Travel Bus Accident
క్రైం

Travel Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.