Alisagar Water Sports | అలీసాగర్​లో వాటర్​ స్పోర్ట్స్​ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఏర్పాట్లను సీపీ సాయి చైతన్య పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Alisagar Water Sports | తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలీసాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు.

Alisagar Water Sports | బోట్లకు అంతరాయం లేకుండా..

అలీసాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ పోటీల నిర్వహణకు అనువైన నీటి విస్తీర్ణం, నీటి లోతు, నీటి సామర్థ్యం, పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని సీపీ పరిశీలించారు. క్రీడాకారులకు అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న బోట్లు, వాటి పనితీరు, బోట్లను నీటిలోకి దించే ప్రదేశాలు, బోట్లు నిలిపి ఉంచే స్థలాలు, క్రీడాకారులు బోట్ల వద్దకు చేరుకునేందుకు ఏర్పాటు చేస్తున్న మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోటీల సమయంలో బోట్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Alisagar Water Sports | భద్రతకు అత్యంత ప్రాధాన్యత

ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ పోటీలలో పాల్గొనే క్రీడాకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట్ల భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించేందుకు రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్ గార్డులు, ఈతగాళ్లు, అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే పోటీల నిర్వహణ ప్రదేశంలో క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది, అధికారుల రాకపోకలకు అనువైన ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రేక్షకుల భద్రత, వాహనాల పార్కింగ్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Alisagar Water Sports | ప్రతిష్టాత్మకంగా నిర్వహణ..

పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా , ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు, రుద్రూర్ సీఐ శ్రీకృష్ణ, బోధన్ ఎస్​హెచ్​వో వెంకటనారాయణ, ఎడపల్లి రమ, స్పోర్ట్స్ విభాగానికి సంబంధించినటువంటి సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harvester Lease Kidnapping | హార్వెస్టర్ లీజు పేరుతో కిడ్నాప్.. నలుగురు నిందితుల అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *